ఏసీలో సత్యదేవుని నిత్యకల్యాణం - 10 lakhs
ఎండలు మండిపోతున్న వేళ తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణస్వామి దేవస్థానంలోని నిత్యకల్యాణ మండపంలో ఏసీ పెట్టించారు. వేడి నుంచి భక్తులు ఉపశమనం పొందుతున్నారు.
ఏసీలో సత్యదేవుని నిత్యకల్యాణం
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం నిత్యకల్యాణ మండపంలో ఏసీ పెట్టించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు మట్టే సత్యప్రసాద్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. దీంతో ఎండలు మండిపోతున్న వేళ చల్లదనం మధ్య సత్యదేవుని నిత్య కల్యాణంలో భక్తులకు ఆనందంగా పాల్గొంటున్నారు. చల్లని వాతావరణంలో వేడుకను తిలకించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.