ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంతర్వేది అనుభవం.. అన్నవరం అధికారులు అప్రమత్తం

By

Published : Sep 9, 2020, 12:32 AM IST

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని రథం అగ్నికి ఆహుతి కావడంతో అన్నవరం దేవస్థానం అధికారులు ప్రమత్తమయ్యారు. ఆలయంలో భద్రతా పరమైన ఇబ్బందులను గుర్తించి తగు జాగ్రత్తలు చేపట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

annavaram temple
annavaram temple

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దివ్య రథం అగ్నికి ఆహుతి అయిన ఘటనతో అన్నవరం దేవస్థానంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం సమయంలో గ్రామోత్సవంలో వినియోగించే వెండి గరుడ, గజ, ఆంజనేయ వాహనాలు, పల్లకీలు ఇప్పటివరకు కొండ దిగువన వాహనాల సత్రం వద్ద హాలులో ఉంచగా భద్రతా పరంగా ఇబ్బందులను అధికారులు గుర్తించారు. వీటిని కొండపైకి తరలించి భద్రపరిచారు. అదేవిధంగా కొండ దిగువన ఉన్న చెక్క రావణబ్రహ్మ, పొన్న వాహనాలకు భద్రతా ఇబ్బందులు లేకుండా వాహనశాలకు భారీ గేట్లు అమర్చుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు భద్రత సిబ్బందిని నియమించారు.

ABOUT THE AUTHOR

...view details