తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. వివిధ విభాగాల నుంచి 119 కోట్ల 49 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పోల్చితే సుమారు 16 కోట్ల 77 లక్షలు అధికంగా వచ్చిందన్నారు. ఎక్కువగా వ్రతాల ద్వారా 29 కోట్ల 87 లక్షలు, హుండీల ద్వారా 14 కోట్ల 67 లక్షలు, ప్రసాదం విక్రయాల ద్వారా 25 కోట్ల 82 లక్షలు, వసతి గదుల ద్వారా 8కోట్ల 49 లక్షలు... ఇంకా వివిధ రకాల సేవలు, దర్శనాల ద్వారా 7 కోట్ల 13 లక్షల రూపాయలు సమకూరాయని అధికారులు తెలిపారు. లీజులు, లైసెన్సుల ద్వారా 14 కోట్ల 75 లక్షలు, ఇతర విభాగాల ద్వారా 17 కోట్ల 49 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2019-20లో 130 కోట్ల 65 లక్షల వరకు ఆదాయం రావచ్చని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేస్తున్నారు.
అన్నవరం ఆలయానికి పెరిగిన ఆదాయం - prasadam
అన్నవరం దేవస్థానానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో పలు విభాగాల ద్వారా 119 కోట్ల 48 లక్షల ఆదాయం సమకూరింది.
అన్నవరం ఆలయానికి పెరిగిన ఆదాయం
Last Updated : Apr 24, 2019, 4:57 AM IST