తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అన్న ప్రసాద వితరణను ఉన్నతాధికారులు పునః ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 20 నుంచి నిత్యాన్నదానాన్ని నిలిపివేశారు. గత కొద్ది నెలలుగా స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నప్పటికీ అన్న ప్రసాద వితరణ ప్రారంభించలేదు.
ప్రస్తుతం ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చిన మేరకు... తిరిగి అన్న ప్రసాద వితరణ పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ఒక బ్యాచ్‌కు హాల్లో 243 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. గతంలో హాలుకు 450 మందిని అనుమతించేవారు. ప్రత్యేక పూజల అనంతరం ఈవో త్రినాథరావు చేతుల మీదుగా అన్న ప్రసాదం అందిస్తున్నారు.