తూర్పుగోదావరి జిల్లా వీవీ మెరకలో విద్యుత్ ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించాడు. గ్రామానికి చెందిన గంటా భిమారావు(75) ఇంటి పై నుంచి చాలా రోజులుగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు తన ఇంటి వద్ద పనిచేసుకుంటూ ఉండగా.. విద్యుత్ తీగలు తెగి అతనిపై పడ్డాయి. దీంతో భిమారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై గోపాలకృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వీవీ మెరకలో విద్యుత్ ప్రమాదం.. ఒకరు మృతి - వీవీ మెరకలో విద్యుత్ ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం వీవీ మెరకలో విద్యుత్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుత్ ప్రమాదం