ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ambedkar District:'కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్​ జిల్లాగా మార్చాలి' - తూర్పు గోదావరి తాజా వార్తలు

Ambedkar District: కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్​ జిల్లాగా మార్చాలని చేస్తూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో లాంగ్ మార్చ్​ను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంబేడ్కర్​ అభిమానులు, జిల్లా మద్దతుదారులు లాంగ్ మార్చ్​ చేసుకుంటూ అధిక సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు.

long march in amalapuram
కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్​ జిల్లాగా మార్చాలని లాంగ్​ మార్చ్​

By

Published : Mar 7, 2022, 10:19 PM IST

Ambedkar District: కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్​ జిల్లాగా మార్చాలని చేస్తూ గోదావరి జిల్లా అమలాపురంలో లాంగ్ మార్చ్​ను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్​ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంబేడ్కర్​ అభిమానులు ,జిల్లా మద్దతుదారులు లాంగ్ మార్చ్​ చేసుకుంటూ అధిక సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. తర్వాత అంబేడ్కర్​ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కోనసీమకు అంబేడ్కర్​ జిల్లా పేరు పెట్టాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details