కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ షేక్ బాషా అన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించి ఇంటివద్దే ఉండాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో ఆయన పర్యటించారు. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.
'అధికారులకు సహకరించండి.... ఇంట్లోనే ఉండండి'
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అమలాపురం డీఎస్పీ షేక్ బాషా అక్కడ పర్యటించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు.
amalapuram dsp visited kottapeta