ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగారం దుకాణంలో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం - east godavari

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ఓ బంగారం దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీస్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

అగ్నిప్రమాదం

By

Published : Aug 17, 2019, 12:41 PM IST

బంగారు దుకాణంలో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆకుల బంగారం దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. దుకాణంలోని ఫర్నిచర్, ఏసి, టీవీ, బల్లలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణంలో నుంచి పొగలు రావడంతో తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న స్థానికులు యజమానికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. దుకాణంలో కాలిపోయిన ఫర్నిచర్ విలువ మూడు లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. దుకాణంలోని బంగారు, వెండి ఆభరణాలు పూర్తిగా కరిగి ముద్దగా మారిపోయాయి. వాటి విలువ లక్షల్లో ఉంటుందని బాధితుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details