Agitation Continues Against Chandrababu Naidu Arrest :చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మేముసైతం అంటూ న్యాయవాదులు, ఐటీ నిపుణులు, గృహిణులు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Leaders Agitations Continues Against CBN Arrest :చంద్రబాబు అక్రమ అరెస్టు, రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పోస్ట్ కార్డు ఉద్యమం (Postcard Movement in Dharmavaram) చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రాష్ట్రపతి భవన్‌కు పోస్టుకార్డులు పంపించారు. నంద్యాల రిలే నిరాహార దీక్షలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలుగుదేశం నాయకులు దీక్ష చేశారు. కడపలో T.N.S.F ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి దీక్షా శిబిరంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు.
NRIs Agitation in America on CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ప్రవాసాంధ్రుల నిరసనలు..
TDP Cadre Protest in AP : చంద్రబాబు అక్రమ అరెస్టుపై గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో మహిళలు చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం దీక్షలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో MLA గద్దె రామ్మోహన్ ఆధ్వర్యాన మైనార్టీలు నిరసన దీక్ష చేశారు. T.N.T.U.C నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న బొండా ఉమ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు సారథ్యాన తెలుగుదేశం నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.