తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. 204 మీటర్ల సామర్థ్యమున్న భూపతిపాలెం జలాశయంలో 203 మీటర్ల వరకు నీరు చేరింది. రెండు గేట్లు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని దిగువనున్న సీతపల్లి వాగులోకి అధికారులు విడుదల చేశారు. గొట్టాల రేవు వీధిలో బట్టలు ఉతుకుతున్న దేవి కూమారి అనే మహిళ ఉద్ధృత ప్రవాహానికి కొట్టుకు పోతుండగా.. స్థానిక యువకులు కాపాడారు.
తూర్పు గోదావరి ఏజెన్సీలో నిండుకుండలా జలాశయాలు - రంపచోడవరంలో భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉద్ధృతిగా ప్రవహిస్తూ భయానకంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని సీతపల్లి వాగులో.. దేవి అనే మహిళ కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు.
ఏజెన్సీ జలాశయాలు
భూపతిపాలెం, సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయాలు నిండు కుండల్లా మారాయి. వర్షాలకు తోడు వాగులుూ నిండిపోవడంతో.. గిరిజనుల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఇదీ చదవండి:తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు.. ఇబ్బందుల్లో ప్రజలు