కాకినాడ జేఎన్టీయూలో స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీగా పని చేసిన ప్రసాదరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కులపతి హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇంజినీరింగ్, పీహెచ్డీలు పూర్తి చేసినవారికి పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సుల్లో చదివి ప్రథమ స్థానంలో నిలిచినవారికి బంగారు పతకాలు అందించారు. గవర్నర్ చేతులమీదుగా పట్టాలు, పతకాలు అందుకోవడంతో పట్టభద్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు తమ చదువులో కీలక పాత్ర పోషించారని చెప్పారు. భవిష్యత్ లో మంచి స్థానాల్లో స్థిరపడి విశ్వవిద్యాలయానికి మంచిపేరు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూలో స్నాతకోత్సవం...విద్యార్థుల ఆనందం - kakinada
కాకినాడ జేఎన్టీయూలో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు, పతకాలు అందుకోవడంతో పట్టభద్రులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్లో మంచి స్థానాల్లో స్థిరపడి దేశానికి, తల్లిదండ్రులకు, యూనివర్శిటీకి మంచి పేరు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూలో స్నాతకోత్సవం...విద్యార్థుల ఆనందం