ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సునీల్ తరఫున నటుడు శివాజీ ప్రచారం

నాకు ఏ పార్టీతో సంబంధం లేదు... కాకినాడలో ఎంపీగా చలమలశెట్టి సునీల్ విజయాన్ని సాధిస్తాడు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చేది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోనే: నటుడు శివాజీ

నటుడు శివాజీ ప్రచారం

By

Published : Apr 6, 2019, 3:46 PM IST

వచ్చే ఎన్నికల్లో మంచి నేతలకి ఓటు వేయాలని సినీ నటుడు శివాజీ.. ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్​కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి జగన్నాథపురం, ఏటిమొగ్గ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ విజయబావుటా ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తనకు పార్టీలతో సంబంధం లేదని...కేవలం తన చిత్రానికి నిర్మాతగా పని చేసిన సునీల్​కు మద్దతు ఇచ్చేందుకే ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు. సునీల్ వంటి పారిశ్రామికవేత్త ఎంపీ అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

నటుడు శివాజీ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details