భూ తగదాల ఘర్షణల తరువాత,ఓ వ్యక్తి విగత జీవిగా మారడంతో,బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం గోరస గ్రామంలో మడికి అర్జన్ రావు,తన సాగు చేస్తున్న భూమితో కొందరికి తగాదా వచ్చింది.ఇరు వర్గాలు మద్య ఘర్షణలు జరిగాయి.ఈ నేపధ్యంలో అర్జునరావు స్మశానవాటికలో విగత జీవిగా పడిఉండటంతో,వైరి వర్గం వారే ఈ హత్య చేయించారని కుటుంబ సభ్యులు మృత దేహంతో స్థానిక సెంటర్లో ఆందోళనకు దిగారు.నిందితులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.తగిన న్యాయం చేస్తామని పోలీసు చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు..
గోరసలో మృతదేహంతో ధర్నా
భూ తగాదాలతో హత్యకు పాల్పడ్డారంటూ,తమకు న్యాయం చేయాలని మృతదేహంతో ఓ కుటుంబం కొత్తపల్లి మండలం గోరస సెంటర్లో ఆందోళనకు దిగింది.
accidentally a man died and his family members protests with deadbody at gorasa in east godavari district