ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అయ్యా.. పింఛను ఇప్పించండి" - దివ్యాంగుడు ఆవేదన

పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఓ దివ్యాంగుడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తనకు 70 సంవత్సరాల వయసున్నా ఇప్పటి వరకూ పింఛన్​ రావడం లేదని ఆవేదన వ్వక్తం చేశారు.

కలెక్టర్ కు తన గోడును చెబుతున్న దివ్యాంగుడు

By

Published : Jul 5, 2019, 2:56 PM IST

పింఛను ఇప్పించాలని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగుడు

పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఓ దివ్యాంగుడు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొరపెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా... కార్యాలయం ఆవరణలో వేచివున్న దివ్యాంగుడి వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. రావులపాలెం మండలం ఆత్రేయపురానికి చెందిన బాధితుడు తాడిశెట్టి దుర్గారావు.. తన వయసు 70 సంవత్సరాలని తెలిపారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నానన్నారు. ఎవరూ లేని అనాథ అయిన కారణంగా.. పింఛన్ కు అవసరమైన ధ్రువపత్రం సమర్పించలేకపోయానని చెప్పారు. ఇప్పటికైనా పింఛన్ ఇప్పించాలని అధికారులను కోరారు. అధికారులతో మాట్లాడి పింఛన్ వచ్చే ఏర్పాటు చేస్తానని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details