ప్రియుడు.. సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు - స్నేహితులు
ప్రేమించింది.. నమ్మింది.. జీవితం తనే అనుకుంది. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని కలలు కన్నది. అంతలా..నమ్మి సర్వస్వం అనుకున్న ప్రియుడే... చివరికి వంచకుడయ్యాడు. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. అదీ చాలదన్నట్లు మరో దారుణానికి ఒడిగట్టాడు.
కాకినాడలోని రాగంపేటకు చెందిన బొబ్బిలి పృధ్వీరాజు అనే వ్యక్తిని ప్రేమించిందో యువతి. పెళ్లి చేసుకుంటాడు కదా! అని నమ్మింది. బయటకు తీసుకెళ్తే సరే అంటూ వెల్లింది. తీరా వెళ్లాక... ప్రియుడే స్నేహితులతే కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆపై వీడియో తీశారు. ఈ మేరకు బాధితురాలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పృధ్వీ రాజుతోపాటు అతడి స్నేహితులు వాసుపల్లి సాయి, శ్యామ్‌కుమార్, నీలాపు సాయిలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఆ యువతిని మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులు పరామర్శించారు.