స్వామివారి కోసం 500 కేజీల లడ్డు! - laddu
ఒకటా! రెండా! ఏకంగా 500 కేజీల లడ్డును తయారు చేశారు. ఈ లడ్డు అందరినీ ఆకట్టుకుంటోంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కోసం ఈ లడ్డు.
500kg_laddu_prepared_for_annavaram_swamy
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కోసం ఏకంగా 500 కేజీల లడ్డును తయారు చేయించారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫల, పుష్ప సేవకు తాపేశ్వరంలో తయారు చేసిన ఈ లడ్డును స్వామి వారి నివేదనకు అందించారు. 220 కేజీల పంచదార, 130 కేజీల శనగ పిండి, 110 కేజీల ఆవునెయ్యి, 6 కేజీల బాదం పప్పు, 23 కేజీల జీడీ పప్పుతో దీన్ని తయారు చేశారు. ఈ లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నారు.