ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక - గోదావరి

గోదావరి ఉప్పెనలా ప్రవహించటంతో...ధవలేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

By

Published : Aug 9, 2019, 6:35 AM IST

Updated : Aug 9, 2019, 8:50 AM IST

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌ వద్ద 14.60 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు...రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి ఎక్కువైతే... సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డెల్టా కాల్వలకు 7,700 క్యూసెక్కులు నీటిని, సముద్రంలోకి 13.97 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.

భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. 47.7 అడుగుల నీటిమట్టం ఉండడం వల్ల మెుదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: గోదావరిలో నిలకడగా వరద ప్రవాహం

Last Updated : Aug 9, 2019, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details