ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

220 కేజీల గంజాయి పట్టివేత..లారీ స్వాధీనం - prathipadu

అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల గంజాయిని ప్రత్తిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఒక హోటల్ వద్ద లారీ నిలిచి ఉంది. లారీ నుండి గంజాయి వాసన వస్తుందన్న సమాచారం మేరకు లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

220 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

By

Published : Aug 10, 2019, 8:01 PM IST

220 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై ఓ హోటల్‌ వద్ద ఆగివున్న లారీలో 220 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ నుంచి గంజాయి వాసన వస్తుందన్న సమాచారం మేరకు ప్రత్తిపాడు తహసీల్దారు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వంతాడ ఆండ్రూ మినరల్స్‌ నుంచి మైనింగ్​ను తరలిస్తున్న ఈ లారీలో 110 ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు నాలుగున్నర లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. త్వరలో సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై రవికుమార్‌, ఎమ్మార్వో నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details