ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘వివేకా’ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం - వివేకా హత్య కేసు విచారణ వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ముగ్గురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగినప్పుడు వివేకా ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

viveka cbi
viveka cbi

By

Published : Sep 22, 2020, 1:09 PM IST

Updated : Sep 23, 2020, 9:07 AM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. రెండో విడత దర్యాప్తునకు మొదట్లో ఇద్దరు అధికారులే రాగా ప్రస్తుతం 10 మంది పని చేస్తున్నారు. మూడు రోజులుగా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారణ కొనసాగుతోంది. మంగళవారం పులివెందులకు చెందిన ముగ్గుర్ని పిలిపించారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. ఆ నెలకు సంబంధించిన వివేకా ఫోన్‌ కాల్‌డేటాపైనా దృష్టి పెట్టారు.

ముఖ్యంగా 14, 15 తేదీల్లో కాల్‌ చేసిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీ ఈ కేసులో కీలక ఆధారాలను పొందేందుకు సీబీఐకి నిరీక్షణ తప్పట్లేదు. కొన్ని పత్రాల కోసం సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో వేసిన పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని న్యాయస్థానం తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై పైకోర్టుకు వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Last Updated : Sep 23, 2020, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details