తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు రోజా, కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివానంద రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
పేదలకు ఇళ్లు కట్టించడంలో రాష్ట్రం మొదటి స్థానం: రోజా - tirupathi news
తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు రోజా, కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివానంద రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
పేదలకు ఇళ్లు కట్టించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజలు ఇళ్లు కట్టుకుంటుంటే మైనింగ్ జరుగుతుందని తెదేపా అలజడి సృష్టిస్తోందని రోజా ఆరోపించారు. మూడో దశ కరోనా హెచ్చరికలు వస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని రోజా సూచించారు.
ఇది చదవండి: