కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లి, మదనపల్లి, వాల్మీకిపురం నియోజకవర్గాల ప్రజలు చిత్తశుద్ధితో, ఐకమత్యంగా కృషి చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా పారిశుద్ధ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఐకమత్యంగా కరోనాపై పోరు... ఆదర్శంగా పల్లెల తీరు! - ఏపీలో కరోనా కేసులు
కరోనా పోరులో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాల ప్రజలు. అధికారులు సైతం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా నేటికీ ఇక్కడా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా 20 పాజిటివ్ కేసులు నిర్ధరించారు. ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు, అధికారులు సమన్వయంతో కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. లాక్డౌన్తో ఇక్కడి ప్రజలకు ఇబ్బందిలేకుండా కొందరు స్వచ్ఛందంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే పూర్తిస్థాయిలో కరోనా మహమ్మారిని దరిదాపులకు రాకుండా చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు, ప్రజలు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు