Fire in forest: చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లి సమీపంలోని చిన్నగుట్ట అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. మరోవైపు చంద్రగిరి చారిత్రక కట్టడం కోట సమీపంలోని దుర్గం గుట్టకు కూడా అగంతుకులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. నాగయ్యగారిపల్లి, రెడ్డివారిపల్లి నుంచి మంటలు క్రమంగా కోట వైపు విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
చిన్నగుట్ట అడవికి నిప్పు.. రెండు గ్రామాల మధ్య ఎగసిపడుతున్న మంటలు - రామిరెడ్డిపల్లి-రెడ్డివారిపల్లికి మధ్య పూర్తిగా దగ్ధమైన అటవిప్రాంతం
fire in forest: రెడ్డివారిపల్లి సమీపంలోని చిన్నగుట్ట అటవీప్రాంతంలో అగంతుకులు నిప్పుపెట్టారు. రామిరెడ్డిపల్లి-రెడ్డివారిపల్లికి మధ్య అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. అటవీప్రాంతం పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు దుర్గం గుట్టకూ దుండగులు నిప్పు పెట్టారు. అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడవికి నిప్పు పెట్టిన దుండగులు
fire in forest: రెండు రోజుల క్రితం కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం రెడ్డివారిపల్లి నుంచి మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. మంటలను అదుపు చేయకపోతే కోట పరిసర ప్రాంతాలలో పురాతన కట్టడాలకు ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండి: