చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివ ఈశ్వరాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని దైవదర్శనం చేసుకున్నారు. ఆలయాలకు విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పుత్తూరులో వైభవంగా ఉగాది వేడుకలు - puttor
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జామునుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
ఉగాది వేడుకలు