ఎర్రచందనం అక్రమ రవాణా కేసులను విచారించడానికి తిరుపతిలో రెండు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అదనపు జిల్లా కోర్టు, జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రత్యేక కోర్టుల్లో పనిచేసే సిబ్బంది జీతాలతో పాటు కోర్టుల నిర్వహణకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఎర్రచందనం కేసులను విచారించేందుకు తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులు - తిరుపతి నేటి వార్తలు
తిరుపతిలో రెండు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులను విచారించడానికే ఈ కోర్టులు ఏర్పాటు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితంగా శేషాచలం అడవుల్లో అక్రమ ఎర్రచందనం రవాణాను అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
అదనపు జిల్లా కోర్టులో జిల్లా జడ్జితో పాటు 31 మంది సిబ్బంది.... మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జితో పాటు 27 మంది సిబ్బంది నియమించుకొనేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. శేషాచలం అటవీప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి 2015లో అప్పటి ప్రభుత్వం.. తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం పరిరక్షణ ప్రత్యేకదళంను ఏర్పాటు చేసింది. గడిచిన ఆరు సంవత్సరాలలో ఈ టాస్క్‌ఫోర్స్ 120 కేసులు నమోదు చేసింది.
ఇదీచదవండి.