ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్లాక్​ ఫంగస్​తో రుయా ఆస్పత్రిలో ఇద్దరు మృతి - Rua Hospital news

తిరుపతి రుయా ఆస్పత్రిలో బ్లాక్​ ఫంగస్​ కారణంగా ఇద్దరు రోగులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఐదుగురు బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని వైద్యాధికారులు చెప్పారు.

black fungus
బ్లాక్​ ఫంగస్​ మరణాలు

By

Published : May 21, 2021, 9:48 PM IST

బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లెకి చెందిన రాజేంద్రబాబు, కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య బ్లాక్ ఫంగస్​చికిత్స పొందుతూ మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. మరో ఐదుగురు బాధితులు ఇదే లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details