ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుడా 3వ పాలకమండలి సమావేశం... కీలక నిర్ణయాలకు ఆమోదం

By

Published : Oct 21, 2020, 11:06 PM IST

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలో విస్తృతంగా అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తుడా కార్యాలయంలో మూడవ పాలకమండలి సమావేశం నిర్వహించారు.

tuda third Governing Body meeting at tirupati chittoor
తుడా 3వ పాలకమండలి సమావేశం... కీలక నిర్ణయాలకు ఆమోదం

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)లో పాలన పరమైన సమస్యలు తొలగించడానికి అదనపు సిబ్బంది నియామకానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. తుడా కార్యాలయంలో మూడో పాలకమండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తుడా పరిధిలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

లాక్​డౌన్ కారణంగా తుడా వాణిజ్య సముదాయాల్లోని దుకాణాదారులకు 3 నెలల అద్దె మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. 58 లక్షల రూపాయల తితిదే నిధులతో రహదారి డివైడర్లు అభివృద్ధి చేయాలని తీర్మానం చేశారు. కార్యాలయంలోని ఖాళీ స్థలంలో రూ. 4.20 కోట్లతో భవన నిర్మాణం, తుడా విస్తరించిన 3315.4 చ.కి.మీ పరిధిలో బృహత్ ప్రణాళిక రూపొందించేందుకు న్యూ ఢిల్లీకి చెందిన సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ అసోసియేట్స్​కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తుడా పరిధిలో ఉన్న ప్రతి ఇంటింటికి ఉద్యానవన విభాగం ద్వారా నారింజ, నిమ్మ, జామ, దానిమ్మ, కరివేపాకు తదితర చెట్లను పంపిణి, తుడా పరిధిలో 7 ప్రదేశాల్లో గోవిందధామం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాయల్ చెరువును ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, అథారిటీ నిధులతో నిర్మించిన గ్రంధాలయ భవనాలలో ఫర్నీచర్, కంప్యూటర్స్, పుస్తకాలు, టీవీల ఏర్పాటు, కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు విశ్రాంతి భవనం నిర్మాణానికి నిర్ణయించినట్టు వివరించారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యుల హోదాలో ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తుడా వీసీ హరికృష్ణ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఏపీ ఎంసెట్​ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

ABOUT THE AUTHOR

...view details