ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలవరాన్ని అడ్డకునేందుకు వైకాపా కుట్ర' - ec

ఎన్నికల కోడ్ ముసుగులో పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నర్సింగ్​ యాదవ్​ ఆరోపించారు.

'ప్రభుత్వ కార్యకలాపాలు ప్రతిపక్షానికెలా అందుతున్నాయి..?'

By

Published : May 2, 2019, 8:41 PM IST

'పోలవరాన్ని అడ్డకునేందుకు వైకాపా కుట్ర'

చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నర్సింగ్​ యాదవ్​... వైకాపా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్​ చేశారు. ఎన్నికల కోడ్​ ముసుగులో పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు..ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అధికారిక వ్యవహారాల విషయాలను... వైకాపా నేతలు జగన్, విజయసాయికి ఎలా చేరుతున్నాయని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details