తిరుమలలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. జీఎన్‌సీ టోల్ గేట్ వద్ద ఉన్న గీతా ఉద్యానవనం, పద్మావతి నగర్లోని ఉద్యానవానాలను అటవీ విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని సూచనలు చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో పూల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు పెంచాలన్నారు.
నారాయణగిరి ఉద్యానవనాలు, శిలాతోరణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. తిరుమల విద్యుత్ అవసరాలకు ధర్మగిరి అటవీ ప్రాంతంలో 20 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.