అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, అన్నమయ్య శరణాగతి సేవాసంఘం, తిరుపతి కళాకారుల ఆధ్వర్యంలో తిరుపతిలో స్వరజనీరాజనం పేరుతో ఎస్పీబీకి నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తితిదే ఆస్థాన గాయకులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పారుపల్లి రంగనాథ్ హాజరయ్యారు. ఎస్పీ బాలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
సంతాప సభలు, స్వరనీరాజనాలతో పాటు ఎస్పీబీ చిత్రపటాన్ని ముందు పెట్టుకుని రోజుకు ఆరు గంటల పాటు సంగీత సాధన చేయగలిగనపుడే ఆయనకు నిజమైన నివాళులని తితిదే ఆస్థాన గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నారు. 40 వేలకు పైబడి పాటలకు గానం చేసిన బాలు.. కరోనా వైరస్ సోకక ముందు వరకూ రోజు ఎనిమిది గంటలకుపైబడి సాధన చేసేవారని పేర్కొన్నారు. అనంతరం ఆయన గీతాలను ఆలపించారు.