తిరుపతి తితిదే పరిపాలనా భవన ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేశారు. తితిదే ఈవో జవహర్ రెడ్డి తీరును నిరసిస్తూ.. బైఠాయించారు. భారత్ బంద్కు మద్దతుగా పరిపాలనా భవనాన్ని మూసివేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు కార్మిక సంఘాల నాయకులు ఈఓ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉండాలని సిబ్బంది చెప్పడంతో మూడు గంటలపాటు నిరీక్షించారు. వెనుక వచ్చిన ఇతరులను కలిసిన ఈఓ తమని కలవకుండా వెల్లిపోయారని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. గంటలపాటు నిరీక్షింపచేసి ..కావాలనే కార్మికులపట్ల తన నిర్లక్ష్య వైఖరి చాటుతున్నారని నేతలు ఆరోపించారు.
తితిదే ఈవో జవహర్ రెడ్డి తీరును నిరసిస్తూ కార్మిక సంఘాల ధర్నా
తితిదే ఈవో జవహర్ రెడ్డి తీరును నిరసిస్తూ తిరుపతి తితిదే పరిపాలనా భవన ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు. గంటల తరబడి తమను వేచి ఉంచేలా చేసి భారత్ బంద్కు మద్దతు ఇచ్చే వినతిపత్రాన్ని తీసుకోకుండా వెళ్లిపోయాడని వాపోయారు.
తితిదే ఈవో జవహర్ రెడ్డి తీరును నిరసిస్తూ కార్మిక సంఘాల ధర్నా
బంద్కు సహకరించమని కోరటానికి వెళ్లిన కార్మిక నాయకుల పట్ల ఈవో వ్యవహరించిన తీరును నేతలు తీవ్రంగా ఖండించారు. సమాచారం తెలుసుకొన్న అదనపు సీవీఎస్ఓ శివ కుమార్ రెడ్డి ఆందోళన చేస్తున్న నేతలకు నచ్చజెప్పారు. ఈఓకు తగిన సమాచారం లేకపోవటంతో సమస్య తలెత్తిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నా విరమించారు.
ఇదీ చూడండి.హైకోర్టు న్యాయమూర్తులకు కియా కార్లు