చిత్తూరు జిల్లా తవణపల్లి మండలం మొదలపల్లి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన కొంతమంది ట్రాక్టర్లో సిద్ధేశ్వరస్వామి ఆలయానికి వెళుతుండగా.. వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. సుమారు 15మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి - చిత్తూరు జిల్లా మొదలపల్లిలో ట్రాక్టర్ బోల్తా
వారంతా దేవుని దర్శనం కోసం సంతోషంగా బయలుదేరారు. ట్రాక్టర్లో పిల్లా పెద్దా సందడి చేస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో ఊహించని ప్రమాదం. ఒక్కసారిగా వారు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. కనురెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిశాయి.
మొదలపల్లిలో ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మృతి