అంతా కలిసి సరదాగా జూకి వెళ్దామనుకున్నారు. అక్కడ పులులు...సింహాలు...చెంగు చెంగున ఎగిరే లేళ్లను చూసి ఆనందిద్దామనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అమ్మానాన్న బలవంతంతో పాపికొండల సందర్శనకు వెళ్లిన హాసినీని చూసి స్నేహితులంతా నిరాశ చెందారు. సరే వచ్చాక ఎన్నో కబుర్లు చెప్పుకుందామనుకున్నారు... చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ పలకరించే హాసిని తిరిగి వస్తుందో రాదో అన్న బాధతో ఉన్నారు. తిరుపతి స్ప్రింగ్ డేల్ పాఠశాలలో చదువుతున్న హాసినీ పాపికొండల పర్యటనకు వెళ్లింది... నిన్న జరిగిన విషాదకర ఘటనలో తన తండ్రి సుబ్రహ్మణ్యంతోపాటు గల్లంతైన తమ స్నేహితురాలు హాసినీని తలుచుకుంటూ ఇప్పుడు తోటి విద్యార్థులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. హాసినీ నవ్వుల కోసం... స్నేహితులు, గురువులు బాధనిండిన గుండెలతో ఎదురుచూస్తున్నారు.
నవ్వుల... హాసినీ గల్లంతు - hasini
పాపికొండల్లో పడవ ప్రమాదం ఎంతో మందికి విషాదం మిగిల్చింది... తిరుపతిలోని స్ప్రింగ్ డేల్ పాఠశాల విద్యార్థులు శోకసంద్రంలో ఉన్నారు. పాపికొండల పర్యటనకు వెళ్లిన తమ స్నేహితురాలు హాసినీ... గల్లంతవ్వడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది... వారి స్నేహితురాలు చిరునవ్వులతో తిరిగి రావాలని వారందరూ కోరుకుంటున్నారు.
నవ్వుల... హాసినీ గల్లంతు
Last Updated : Sep 16, 2019, 4:16 PM IST