ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుయా ఘటన: 'మృతులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి' - Ruia incident Latest Update

తిరుపతి రుయా ఘటనలో మృతిచెందిన వారికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరి మండలం ఐనంబాకంలో... మృతులకు సంతాపంగా చిన్నారులతో కలిసి నారాయణ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

సీపీఐ జాతీయ నేత నారాయణ
సీపీఐ జాతీయ నేత నారాయణ

By

Published : May 12, 2021, 9:26 PM IST

తిరుపతి రుయా ఆసుపత్రి విషాద ఘటనలో మృతులకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకంలో... మృతులకు సంతాపంగా చిన్నారులతో కలిసి నారాయణ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తిరుపతి రుయా విషాద ఘటనలో మృతులను ప్రభుత్వ సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details