కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయి వెలుపల నీరిక్షణ చేస్తున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని సుమారు 70వేల 586 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. సుమారు 36 వేల 599 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 89 లక్షలుగా అధికారులు లెక్కించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - rush
తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వేసవి సెలవలు ముగింపునకు వస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి వస్తున్నారు.
తిరుమల