తిరుమలలోని శేషాచలం కొండలపై పడే వర్షపు నీరు బండరాళ్లకింద ఉన్న మట్టిని కోసుకుంటూ వెళ్లటంతో రాళ్లు, మట్టి రెండో ఘాట్‌రోడ్డులో పడుతున్నాయి. ఆదివారం భాష్యకార్ల సన్నిధి సమీపంలో కొండచరియలు భారీగా విరిగిపడి ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈనెల 13న బండరాయి ఒకటి ఘాట్‌రోడ్డులో పడింది.
- ప్రత్యేక నిఘా అవసరం
వర్షాకాలం ప్రారంభమైతే కొండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి రెండో ఘాట్‌రోడ్డుపై పడుతుంటాయి. గతంలో భారీగా కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను ఐఐటీ ఇంజినీరింగ్ నిపుణులతో తితిదే పరిశీలన చేయించి వాటిపై కాంక్రీటు, స్టీలును వాడి నియంత్రించింది. అన్నిచోట్ల అదే పరిస్థితి. ఎక్కువగా పడే రాళ్లు ప్రాంతాలలో ప్రత్యేకంగా రివిట్‌మెంట్ చేసి రక్షణ గోడను నిర్మించి కొండచరియలు విరిగిపడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఘాట్‌రోడ్డు పరిశీలన బృందాలచే ప్రత్యేక నిఘాను ఉంచి ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు ప్రయత్నించవచ్చు.
- భాష్యకార్ల సన్నిధి నుంచే సమస్య
తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో తిరుమలకు చేరుకునే సమీపంలోని భాష్యకార్ల సన్నిధి నుంచి కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే చెన్నై ఐఐటీ వారి ద్వారా ఆ ప్రాంతంలో రివిట్‌మెంట్ చేసి కాంక్రీట్, స్టీల్‌తో ప్రత్యేక మెస్ ఏర్పాటు చేసి కొండచరియలు విరిగి పడడాన్ని అరికట్టారు. ప్రస్తుతం దానికి సమీప ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతాన్ని ఘాట్‌రోడ్డు ఇంజినీరింగ్ బృందం పరిశీలిస్తోంది. గతంలోనూ తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా ఆ ప్రాంతంలో రాతిగోడను తితిదే నిర్మించింది.