తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు, వారాంతం అయినందువల్ల పెద్దఎత్తున భక్తజనం తిరుమల కొండకు చేరుకుంటున్నారు. తరలివస్తున్న భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం వెలుపల లేపాక్షి వలయం వరకు 2 కిలోమీటర్లకుపైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 26 గంటలు.. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందినవారికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.
వేసవి సెలవులతో.. తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ - తిరుమల
వేసవి సెలవులు, వారాంతాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి సాధారణ దర్శనానికి 26 గంటల సమయం పడుతోంది.
వేసవి సెలవులతో.. తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ