తిరుపతిలో నిల్వ ఉంచిన మాంసాహారం, కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లు, దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు కేసులు నమోదు చేస్తామని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... నగరంలో కల్తీ ఆహారం, నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు. ఇప్పటికే నగర పాలక సంస్థ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద హోటళ్లూ తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. తిరుపతికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు తీరు మార్చుకోని పక్షంలో సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయన్నారు. ఆయా హోటళ్లు, దుకాణాలను సీజ్ చేసేందుకు సైతం వెనుకాడమని హెచ్చరించారు.
కల్తీ మాంసం అమ్మితే హోటల్ సీజ్...! - కల్తీ విక్రయాలపై తిరుపతి కలెక్టర్ మీడియా సమావేశం
మాంసం కొనేటప్పుడు కల్తీదా లేక మంచిదా అని తెలియకుండానే మనం తినేస్తున్నాం. మన లాంటి వారి ఫిర్యాదుల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ వీటిపై చర్యలకు నడుం బిగించారు. కల్తీ మాంసం విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కల్తీ విక్రయాలపై తిరుపతి కలెక్టర్ మీడియా సమావేశం