శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన బృహత్తర ప్రణాళిక అమలుకు భూమిని సేకరించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆలయం చుట్టూ ఉన్న సన్నిధివీధి, దిగువ సన్నిధివీధి, రాజగోపురం పరిసర ప్రాంతాలు, భిక్షాలగోపురం నుంచి రంగుల గోపురంలోపు ఉండే దుకాణాలు తదితర వాటికి సంబంధించి 3.9 ఎకరాల విస్తీర్ణంలోని స్థలాన్ని సేకరించాలని నిర్ణయించింది. 199 మంది నిర్వాసితుల్లో ఇప్పటివరకు 192 మంది తమ పత్రాలను ఆలయ అధికారులకు అప్పగించి పరిహారం తీసుకున్నారు.
న్యాయస్థానానికి నిర్వాసితులు
సన్నిధివీధి పరిసర ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకున్న ఏడుగురు నిర్వాసితులు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోదని ఎక్కువ కావాలని పట్టుపట్టారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బంకమన్నుతో నిర్మించిన ఇళ్లకు సమానంగా అత్యంత ఆధునిక వసతులతో నిర్మించిన వాణిజ్య సముదాయాలకు పరిహారం ఇవ్వడం సరికాదన్నది వాళ్ల వాదన.
ఆమోదం.. ఆనక అభ్యంతరం