చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియాల అటవీ ప్రాంతములో రవి నాయక్ అనే వ్యక్తిని మంటల్లో తగులబెట్టి హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రవి నాయక్ రెండ్రోజుల కిందట స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళాడు. అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపులో భాగంగా అటవీ ప్రాంతంలో రవి నాయక్ శవాన్ని మంటల్లో తగులబెట్టిన ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
ననియాల అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య - murder news in naniyala forest at chittore
ననియాల అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిని మంటల్లో తగులబెట్టి హత్యచేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
రవినాయక్ ని కాల్చిన ప్రాంతం