చిత్తూరు జిల్లా చంద్రగిరిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. చంద్రగిరి జోగులకాలనీకి చెందిన రాజు, రమ్య దంపతుల కుమారుడు జోతీష్... అక్కగార్ల కాలనీలోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడ తోటి పిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. బంధువులు గమనించి జోతీష్ను సంపులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతితో జోగుల కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి
నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి - చంద్రగిరిలో బాలుడు మృతి
నీటి సంపులో పడి ఓ చిన్నారి ప్రాణాలు వదిలాడు. తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం