కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు దర్శనం రద్దు చేసినప్పటికీ నిత్యం స్వామి, అమ్మవార్లకు ఏకాంతంగా నిర్వహించే పూజలో పాల్గొనే అర్చకులు ,సిబ్బందికి వైరస్ సోకకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచటానికి బ్లీచింగ్ పౌడర్‌ను, మలాథియాన్‌ను పిచికారీ చేస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు వినియోగిస్తున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో అధికారుల పారిశుద్ధ్య చర్యలు - coroana virus ap lock down l
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం శ్రీకాళహస్తి ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. స్వామి వారి కైంకర్యాలను నిర్వర్తించే ఆలయ అర్చకులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
శ్రీకాళహస్తి ఆలయంలో పరిశుభ్రతకు పెద్దపీట