ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుచానూరుకి చేరిన శ్రీవారి లక్ష్మీకాసుల హారం... - తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల కోసం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని ఆలయ అర్చకులు తీసుకువెళ్లారు. ఈ రోజు రాత్రి నిర్వహించే గజవాహన సేవలో పద్మావతి అమ్మవారికి... శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించనున్నారు.

Lakshmikas from the Thirumala temple
తిరుచానూరుకి చేరిన శ్రీవారి లక్ష్మీకాసుల హారం

By

Published : Nov 15, 2020, 11:37 AM IST

Updated : Nov 15, 2020, 2:23 PM IST

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... తిరుమల ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని ఆలయ అర్చకులు తీసుకువెళ్లారు. శ్రీవారి ఆలయం నుంచి పల్లకీలో తీసుకువచ్చిన హారాన్ని....పటిష్ఠ భద్రత మధ్య తిరుచానూరుకు తీసుకువెళ్లారు. తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి నిర్వహించే గజవాహన సేవలో పద్మావతి అమ్మవారికి... శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించనున్నారు.

తిరుచానూరుకి చేరిన శ్రీవారి లక్ష్మీకాసుల హారం

శ్రీవారి ధృవమూర్తికి ధరింపచేసే లక్ష్మీహారాన్ని...తిరుచానూరు బ్రహ్మోత్సవాల వేళ.....అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహన సేవ రోజు పద్మావతి దేవి ఉత్సవమూర్తికి అలంకరించటం సంప్రదాయంగా వస్తోంది. లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరు తీసుకువెళ్లే ముందు తిరుమల మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించాల్సి ఉన్నా భారీవర్షం కారణంగా రద్దైంది.

Last Updated : Nov 15, 2020, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details