ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్తలపై వైకాపా అనుచరుల దాడి - వైకాపా

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పనపాకం హరిజనవాడలో తెదేపా కార్యకర్తలపై వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

తెదేపా కార్యకర్తలపై వైకాపా అనుచరుల దాడి

By

Published : Mar 31, 2019, 6:27 AM IST

తెదేపా కార్యకర్తలపై వైకాపా అనుచరుల దాడి
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పనపాకం హరిజనవాడలో తెదేపా కార్యకర్తలపై వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. సర్వే పేరుతో ఊర్లోకి వచ్చిన వైకాపాకు చెందిన ఛానల్ ప్రతినిధులను హరిజనవాడ గ్రామస్థులు ప్రశ్నించగా.. చెవిరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. అడ్డొచ్చిన తెదేపా కార్యకర్తలను కర్రలతో, దుంగలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వారిని పరామర్శించారు. సర్వేల పేరుతో వైకాపా దౌర్జన్యాలు మితిమీరిపోయాయనీ.. దీనిని ఎన్నికల అధికారులు వెంటనే అడ్డుకోవాలని తెదేపా నాయకులు, కార్యకర్తలు కోరారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details