'ఎన్నిసార్లు రీపోలింగ్ ప్రకచించినా గెలుపు ఖాయం' - kanepalli
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్.ఆర్.కమ్మపల్లి, కాలేపల్లి పోలింగ్ కేంద్రాలను ఎంపీ శివప్రసాద్ పరిశీలించారు. ఎన్నిసార్లు రీపోలింగ్ ప్రకటించినా తెదేపా గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఎన్.ఆర్. కమ్మపల్లెలో రీపోలింగ్ సందర్భంగా పోలీసు బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రీపోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్.ఆర్.కమ్మపల్లెలో మొదటగా కాలనీవాసులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు.
చంద్రగిరి నియోజకవర్గం ఎన్ ఆర్ కమ్మపల్లి, కాలేపల్లి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఎంపీ శివప్రసాద్ పరిశీలించారు. ప్రజలను ఇబ్బందికి గురి చేశామని... ఎన్.ఆర్. కమ్మపల్లిలో రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని అయితే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ రీపోలింగ్ నిర్వహించడం బాధాకరమని ఎంపీ తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రకటించినా... ఓటర్లు కదిలివచ్చారన్న ఆయన... చంద్రగిరి నియోజకవర్గంలో తెదేపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.