చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని అధ్యర్వంలో అన్న క్యాంటీన్ కోసం ధర్నా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం తెదేపా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ,వైకాపా ప్రభుత్వం వాటికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. అన్న క్యాంటీన్లను వెంటనే తెరిపించి పేద ప్రజల ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు.
పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్ - తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్
అన్న క్యాంటీన్ల మూసివేతపై తెదేపా శ్రేణులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.
అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ తిరుపతిలో ఆందోళన చేపట్టారు. స్విమ్స్ ఆసుపత్రి దగ్గర గల అన్న క్యాంటీన్ ముందు ధర్నా చేసారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి స్విమ్స్ ఆసుపత్రికి వచ్చే పేద రోగులు, వారి సహాయకులకు కడుపునిండా భోజనం చేసేవారని తెదేపా నేతలు గుర్తు చేశారు.క్యాంటీన్ల మూసివేత కోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో పేద ప్రజలకు ఆకలితో అలమటించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని సుగుణమ్మ అన్నారు. తెదేపా నిరసనలో భాగంగా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రోగుల సహాయకులకు ఉచితంగా పెరుగున్నం పంపిణీ చేశారు.
ఇదీచూడండి.ఆ చిత్రాలతో మియా సంపాదన ఎంతో తెలుసా..!