Chandrababu 2nd Day Kuppam Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజూ పోలీసుల ఆంక్షల మధ్యే చంద్రబాబు పర్యటన సాగింది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న చంద్రబాబు.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశానికి వస్తున్న ప్రజాదరణ చూసే.. తన పర్యటనలు అడ్డుకోవడానికి చీకటి జీవోలు తెచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ రోడ్‌షోలు, సభలు నిర్వహంచలేదా అని ఆయన ప్రశ్నించారు. మా సమావేశాలను దెబ్బతీసి, మేం బయటకు రాకూడదనే లక్ష్యంతో పోలీసులే కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అందులో బాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి విధించే పరిస్థితికొచ్చారు.. ఎవడు కనపడితే వాడిపై కేసులు పెట్టి, నేరుగా జైల్లో పెట్టేస్తారా మీరు.. కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ల స్వార్ధం కోసం ఒక ఉన్మాది, ఒక సైకో, ఒక స్యాడిష్ట్ ..ఇవన్నీ చేస్తావుంటే మీకు కుటుంబాలు ఉన్నాయి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు కూడా ముందుకు రావాలి..మేము చేసే పోరాటం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.. మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయకూడదని ఉద్దేశ్యంతో మేము పోరాడుతున్నాము.. టీడీపీ అధినేత చంద్రబాబు
రామచంద్రారెడ్డి గుర్తుపెట్టుకో ఇది బిగినింగ్ మాత్రమే.. నీ పని పుంగనూరులో కూడా చూస్తాను.. నీ తడాకా ఎంటో చూస్తా.. నేను రెచ్చగొట్టానా, మా మీద తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతూ.. నువ్వొక సైకోకు సైకో కింద తయారయ్యావా నువ్వు.. అదే నేను అనుకుంటే 14 ఏళ్లు ఈ జిల్లాలో నువ్వు తిరిగే వాడివా ఈ జిల్లాలో.. గుర్తు పెట్టుకో కబర్దార్.. ఇదే కుప్పంలో 50కోట్లు అడుగుతావా నువ్వు..బెదిరిస్తున్నాడు..బెదిరిస్తే వదిలిపెడతానా ..ఆ 50కోట్లు ఖర్చు పెడితే అంతటినీ టేక్ఓవర్ చేస్తాను. ఏవడైనా గాని డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు