జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వైకాపా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో వైఎస్ విగ్రహానికి పూజలు నిర్వహించి, కేక్ కోసి, బాణాసంచా పేల్చారు. ఐదేళ్లపాటు సుపరిపాలన అందివ్వాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని బి.కొత్తకోట, ములకలచెరువు, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, పెద్దమండ్యం మండలాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
తంబళ్లపల్లెలో వైకాపా శ్రేణుల సంబరాలు - chittoor
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
తంబళ్లపల్లె