చిత్తూరు జిల్లా పీలేరు మండలం వడ్డేపల్లికు చెందిన కౌలు రైతు వెంకటరమణ (37)... అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగు పెట్టుబడి తిరిగి రాక... అప్పులు పెరిగాయన్న మసస్తాపంతోనే వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి... అధికారులనుంచి ఘటన వివరాలు ఆరా తీశారు. మృతుని కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య - debt
అప్పుల ఊబిలో చిక్కుకుని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి తల్లిని నమ్ముకుని సాగుచేసిన పంటకు సరైన ధరరాక.. అప్పులు తీరక.. తీవ్ర మనస్తాపానికి గురైన చిత్తూరు జిల్లా కౌలు రైతు వెంకటరమణ.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అప్పులపాలయ్యానన్న మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య