ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వమా..! సచివాలయ ప్రశ్నా పత్రం లీకేజీపై స్పందించు? - తిరుపతి

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలు జరిగినా ప్రభుత్వం స్పందించటం లేదంటూ తిరుపతిలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నా పత్రం లీకేజీపై ప్రభుత్వం విచారణ చేపట్టాలంటూ ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వమా..! సచివాలయ ప్రశ్నా పత్రం లీకేజీపై స్పందించు?

By

Published : Sep 26, 2019, 4:48 PM IST

ప్రభుత్వమా..! సచివాలయ ప్రశ్నా పత్రం లీకేజీపై స్పందించు?
జగన్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ చిత్తూరు జిల్లా తిరుపతిలో విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగులకు అన్యాయం చేసేలా పరీక్ష నిర్వహణ జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జరిగిన వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధ్యమం చేస్తామని హెచ్చరించారు. ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details