శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 25 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ వేడుకలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు తెలిపారు. మొదటిరోజు స్వామివార్లకు స్నపన తిరుమంజసం.. ఆరోజు రాత్రి పెద్దశేషవాహనంపై ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తామని చెప్పారు.
శ్రీనివాస మంగాపురంలో జూన్ 25 నుంచి 27 వరకు సాక్షాత్కార ఉత్సవాలు - శ్రీనివాస మంగాపురం తాజా వార్తలు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 25 నుంచి 27 వరకు జరగనున్నాయి. కరోనా కారణంగా ఈ సేవలన్నీ ఏకాంతంగా చేయనున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు.
శ్రీనివాస మంగాపురంలో జూన్ 25 నుంచి 27 వరకు సాక్షాత్కార ఉత్సవాలు
రెండోరోజు హనుమంత వాహనం, మూడో రోజు గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తామన్నారు. కరోనా కారణంగా ఈ సేవలన్నీ ఏకాంతంగా చేయనున్నట్లు వెల్లడించారు. సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ అళ్వార్ తిరుమంజసంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇవీ చదవండి.... : మీకు కొవిడ్ ఉందంటూ మెసేజ్...ఓపెన్ చేశారో..!